రాష్ట్రంలో ఎవరు చేయలేని విధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ
తన తొలి ఎమ్మెల్యే జీతాన్ని నియోజకవర్గానికి విరాళం
డైలీ భారత్, చొప్పదండి:చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన నెల జీతం 1,50,000 రూపాయిలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందించారు . నియోజవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాకంగా సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు అల్పాహారానికి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.
రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాది వేస్తామని చొప్పదండి నియోజకవర్గాన్ని విద్య వైద్య ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకుపోతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.