| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువతిని లాడ్జికి తీసుకెళ్లిన యువకుడు... అదే రోజు ఇంటికికొచ్చారు,వారం తర్వాత విషాదం

యువతిని లాడ్జికి తీసుకెళ్లిన యువకుడు... అదే రోజు ఇంటికికొచ్చారు,వారం తర్వాత విషాదం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిపై విష ప్రయోగం చేయగా.. ఆమె చనిపోయింది. నర్సీపట్నం శారదానగర్‌కు చెందిన యువతికి.. నాతవరం మండలం వెన్నలపాలేనికి చెందిన వాసిరెడ్డి చంద్రశేఖర్‌తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం నిర్వహిస్తున్నారు. జనవరి 27న వీరిద్దరూ విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో ఉన్నారు. అదేరోజు అర్ధరాత్రి దాటిన తరవాత యువతిని శారదానగర్‌లోని ఇంటికి దిగబెట్టి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆమె తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు నీరసపడి వాంతులు చేసుకోవడంతో 30న నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె విశాఖపట్నం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉందని.. నెమ్మదిగా పనిచేసేలా విషప్రయోగం చేసి చంపాలని శేఖర్‌ ప్రయత్నించినట్లు ఆమె రెండు రోజుల క్రితం ఆరోపించారు.

అయితే పరిస్థితి విషమించి యువతి ఇవాళ (సోమవారం) ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తమ బిడ్డ చనిపోవడానికి చంద్రశేఖర్ కారణమని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేస్తోంది. తన కుమార్తె పెళ్లి చేసుకోవాలని కోరడంతో వదిలించుకునేందుకు అతడు విష ప్రయోగం చేశాడని వారు ఆరోపిస్తున్నారు.

Previous మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
Next టిజి అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌
ADVERTISEMENT