Posted on 2026-07-31 05:03:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి న్యాయవ్యవస్థకు, బాధితులకు న్యాయం అందించే ప్రక్రియలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎండి రజాక్ చేసిన సేవలు అజరామరమని, ఆయన మృతి న్యాయరంగానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండి రజాక్ (65) అనారోగ్యంతో మృతి చెందగా, గురువారం చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ సందర్భంగా రజాక్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృత్తిధర్మానికి కట్టుబడి సమాజంలో పేదలకు, బాధితులకు న్యాయపరమైన సేవలు అందించడంలో రజాక్ ఎల్లప్పుడూ ముందుండేవారని ఆయన గుర్తుచేశారు. నివాళులర్పించినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు నయీమ్ ఖురేషి, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >