| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

సోనూసూద్ సేవా సమితి అధ్యక్షుడు ఎస్.కె. సత్తార్ ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటిన కమిటీ సభ్యులు.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోను సూద్ జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలో గల రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

సేవా సమితి అధ్యక్షుడు ఎస్.కె. సత్తార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... సామాజిక సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సోను సూద్ పుట్టినరోజున పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు & సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు, ప్రతినిధులు సురేష్ కుమార్, జోసెఫ్ గురుమూర్తి, ఎం.ఎస్. శాస్త్రి, బాగం మోహన్ రావులతో పాటు బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, రైల్వే స్టేషన్ మాస్టర్, రైల్వే సిబ్బంది మరియు సేవా సమితి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరికలు
Next ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి
ADVERTISEMENT