| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్: 

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం...

పచ్చని ప్రకృతిలో నరమేధం జరుగుతుంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం..!

తల్లి ప్రసవవేదన నుండి ఊపిరి పోసుకున్న

 అరుణ పుష్పాన్ని ఆడపిల్ల అని నలిపేస్తుంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం..!

పసి మొగ్గ  నుండి పండు మొసలి వరకు మహిళలని

నమిలి వస్తుంటే....

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం..!

సమాజ శ్రేయస్సు సమాజ అభివృద్ధి నెపంతో

స్వలాభం కోసం అడవి తల్లిని అంతం చేస్తూ ఉంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం..!

అధికార దాహం తుపాకుల మోతల ప్రతిధ్వనిలో

 ఎందరో అమాయక ప్రజలు బలి అవుతుంటే ...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం..!

రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218.

Previous సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Next సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు
ADVERTISEMENT