డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు పోలీసులు భీమ్లాతండా బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి:రూ.1,300/- నగదు ,ఒక సెల్ ఫోన్, 104 పేక ముక్కలుస్వాధీనం చేసుకున్నారు. వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.జూలూరుపాడు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అటువంటి సంఘటనలపై సమాచారం ఉంటే వెంటనే జూలూరుపాడు పోలీస్ వారికి సమాచారం అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్