| Daily భారత్
Logo




భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

News

Posted on 2026-07-28 17:20:49

Share: Share


భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళను సైబర్ కేటుగాళ్లు రూ.6.70 లక్షలు మోసం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం గౌతాపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్సై మేడాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, లోన్ మంజూరు చేస్తామని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు బాధితురాలి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు. 

ఆ తర్వాత ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపుతూ, డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మహిళ విడతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలు నిందితులు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది.

విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ పోలీసులు వెంటనే బ్యాంకు అధికారులతో సమన్వయం చేసి రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన...

లోన్, ఉద్యోగం, బహుమతి, పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని ఎస్సై మేడాప్రసాద్ హెచ్చరించారు. ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు.  

మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలతో బెదిరిస్తే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >