Posted on 2026-07-26 17:19:21
20 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థత
డైలీ భారత్, పోలవరం: చింతూరు పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని వి.ఆర్.పురం మండలం సోములగూడం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 20 మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం ప్రకారం, శనివారం అర్థరాత్రి నుంచి విద్యార్థినులకు అస్వస్థత ప్రారంభమైంది. అయితే తొలుత పాఠశాల ప్రాంగణంలోనే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరిగా మరింత మంది విద్యార్థినులకు విరోచనాలు రావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అస్వస్థతకు గురైన వారిలో 8 మంది విద్యార్థినులను 108 అంబులెన్స్‌ల ద్వారా వి.ఆర్.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, 11 మంది విద్యార్థినులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌక్వాల్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఎలా సంభవించింది? ఆహారంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఫుడ్ పాయిజన్‌కు గల అసలు కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >