| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం భీమ్లా తండాలోబంజారా ఆడపడుచుల పండుగ తీజ్ గ్రామంలో 9 రోజులు ఘనంగా జరుపుకున్నారు. 

ఆడపడుచులు సంప్రదాయ బంజారా దుస్తుల్లో పాల్గొన్నారుపాటలు & నృత్యాలు తీజ్ పండుగ పాటలు పాడుతూ, గుంపులుగా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు సంప్రదాయంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆడపడుచులుతీజ్ మాత ని పూజించారు తీర్థ ప్రసాదాలు రకరకాల స్వీట్లు, పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించారు

గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంప్రదాయకంగా గ్రామంలోఆడబిడ్డలు ఆనందానికి ప్రతీక తీజ్ పండుగ ఆడపడుచులు ఘనంగా వేడుకలు సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం మరియు గ్రామ దండాల చెరువు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ఆడపడుచులు తెలియజేసినారు


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు, భీమ్లాతండా ఆడపడుచులు, గ్రామ పెద్దలు, పాపిని జనార్ధన్ రామిశెట్టి రాంబాబు,భీమ్లా తండాగ్రామ పెద్దలు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Next ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు
ADVERTISEMENT