డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం) లో ఆశ్రయం పొందుతున్న 27 మంది వృద్ధుల ఆకలి మంటలను దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట రైతు పెనుమత్స సుబ్బరాజు రూ.10,116 రూపాయలను అందజేశారు. వృద్ధులకు పోషణ భారంగా మారడంతో ఆశ్రమ నిర్వాహకులు దాతల సహాయార్థాన్ని కోరుతున్నారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, జ్ఞాపకార్ధాల సందర్భాలను పురస్కరించుకొని ఆశ్రమంలో జరుపుకోవడం వల్ల వృద్ధుల ఆకల దప్పికలను తీర్చగలుగుతారని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
News
అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమం కు ఆర్థిక సహాయం అందజేసిన పెనుమత్స సుబ్బరాజు