డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో రాజీవ్ నగర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
60 వాహనాలు స్వాధీనం, బెల్ట్ షాప్ పై కేసు...
ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నడిపిన కొక్కుల ఆంజనేయులుపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
అనుమానితులపై నిఘా...
నేరాల నియంత్రణలో భాగంగా అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి, వారి ఉపాధి, నివాస వివరాలు సేకరించారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడవద్దని హెచ్చరించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిక...
స్వీయ రక్షణ కోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, గంజాయి సరఫరా గురించి తెలిస్తే చెప్పాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐలు నాగరాజు, గణేష్, రంజిత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
#Sircilla #RajannaSircilla #DSPNagendraChari #CommunityContact #TelanganaPolice #CCCammeras