| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్  జన్మదిన వేడుకలు

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)  జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుతో కలసి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారుఈ సందర్భంగా గిరిబాబు  మాట్లాడుతూ, జూలూరుపాడు, ఏన్కూర్, కారేపల్లి మండలాలకు సీతారామ ప్రాజెక్టు సాగునీటిని వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పాపకొల్లు గ్రామ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, నిమ్మటూరి కనకయ్య (మాజీ ఉప సర్పంచ్), మాలోత్ నరసింహారావు (స్వామి), బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ చారి, గరిడేపల్లి సతీష్, వాంకుడోత్ బాబులాల్ గ్రామ పార్టీ నాయకులు లకావత్ గోపి, ధారావత్ కిరణ్, ధర్మరాజుల పుల్లయ్య, నిమ్మటూరి నరసింహారావు, చింతపట్ల నరసింహారావు, ధర్మరాజుల శ్రీను, పూరేటి శేఖర్ మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Previous దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Next స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం
ADVERTISEMENT