| Daily భారత్
Logo




నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

News

Posted on 2026-07-23 15:54:39

Share: Share


నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ.

డైలీ భారత్, కామారెడ్డి : వర్గీకరణ సాధన తోనే ఎమ్మార్పీఎస్ బాధ్యత తీరిపోలేదని,ఇక కుల మతాలకు అతీతంగా ఎమ్మార్పీఎస్ భవిష్యత్తు ఉద్యమం ఉంటుందని అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీ ల ను రద్దు చేసి నూతన తరం, యువతరం తోనే సంస్థాగత నిర్మాణాలప్రక్రియ ప్రారంభమైందని అది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుందని తెలియ జేస్తున్నాం

మాదిగ ఉద్యమం మానవతా ఉద్యమం...మందకృష్ణ మాదిగ పోరాటం లో అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం తోనే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆగిపోలేదని, సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సమాజం లో అణగారి పోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, వికలాంగుల, అగ్రకులపేదల సంక్షేమం, ఆ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్తు ఉద్యమాలు నిర్ణయిస్తుందని తెలియ చేస్తున్నాం.

మాదిగ మరియు ఎస్సీ ఇతర కులాల న్యాయబద్ధమైన సమస్య వర్గీకరణ సాధన కోసం 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం దేశం లో సాధారణ విషయం కాదని ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కుట్రలు, అణచివేతలు, వెన్ను పోట్లు,ఎదురుకుంటూనే విజయం సాధించిందని తెలియ చేస్తున్నాం.

జాతి నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ న్యాయబద్దం కాని సమస్యను ముట్టుకోడని, న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలి పెట్టారని 32 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర లో వర్గీకరణ తో పాటు గా అనేక సామాజిక సమస్యల పరిష్కారం సమాజం గుర్తించిందని తెలియ చేస్తున్నాం.*

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరగబోయే సామాజిక ఉద్యమ కార్యాచరణ లో యువతరం కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

ఈరోజు కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగింది.

ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ,బట్ట వెంకట్రాములు మాదిగ, పెద్ద బూరి గంగారాం మాదిగ మావురం శ్రీకాంత్ మాదిగ, మహిళా నాయకురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ,బానాపురం లావణ్య మాదిగ, సింగం కాశీరాం,మర్రిపల్లి అరుణ్ మాదిగ,కిష్టపురం పెద్ద కాశీరాం ఎనగుర్తి రాజనర్సయ్య, శైలేష్,జల్లి పల్లి శ్యాం,తిప్పారం రవి,శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >