చూడడం కాదు సార్.. తాళం తీయించండి!
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని ఓ 8వ తరగతి విద్యార్థి నేరుగా "తెహసిల్ దివస్" లో జిల్లా మేజిస్ట్రేట్ (DM) దగ్గరికే వెళ్ళిపోయాడు. బాలుడి ఫిర్యాదు విన్న డీఎం.. పోలీసులతో ఈ అబ్బాయి సమస్య ఏంటో చూడండి అని చెప్పారు. అంతే.. ఆ కుర్రాడు అస్సలు తగ్గకుండా.. చూడడం కాదు సార్.. వెళ్ళి తాళం తీయమని చెప్పండి అంటూ ఫేస్ మీదే స్ట్రైట్‌గా మాట్లాడేశాడు. అంతేకాదు.. కొంచెం కమిషన్ ఇస్తే పని అయిపోతుందా? అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ పిల్లాడి ధైర్యానికి, స్మార్ట్‌నెస్‌కు ఫిదా అయిపోయిన డీఎం.. వెంటనే పోలీసులకు గట్టి ఆర్డర్స్ వేసి, ఆ ఇంటి తాళాలు తీయించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.