డైలీ భారత్ వెబ్ డెస్క్: లిథువేనియాలోని విల్నియస్ లో నిర్వహించిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్ & 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది.
బయాలజీ ఒలింపియాడ్‌లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశ కీర్తిని ప్రపంచానికి చాటగా...
కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో నలుగురు సభ్యులూ స్వర్ణ పతకాలు సాధించి, ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో భారత్‌కు అత్యుత్తమ ఫలితాన్ని అందించారు.
భారత యువత ప్రతిభ, కృషి, విజ్ఞానంపై ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ విజయాలు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి, వికసిత భారత్ నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రానికి మరింత ఊతమిస్తాయి.