| Daily భారత్
Logo




సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్

News

Posted on 2026-07-19 14:24:33

Share: Share


సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్

శిథిల భవనం, తాగునీరు, మందులు, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఐద్వా, వ్యకాస నాయకుల డిమాండ్

డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలోని పల్లె దవాఖానా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) ఆధ్వర్యంలో దవాఖానాలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో దవాఖానా దుస్థితి స్పష్టంగా కనిపించింది.

ప్రధాన సమస్యలు ఇవే..

దవాఖానా భవనం పూర్తిగా శిథిలమైపోయింది. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు కారుతుంది. భవనం ఎప్పుడు కూలిపోతుందోననే భయంతోనే ANM సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

బాత్ రూమ్ సౌకర్యాలు లేవు. తాగునీరు అందుబాటులో లేదు. దీంతో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ ఆవరణంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉంది.

డాక్టర్లు, ఇతర సిబ్బంది లేరు. అవసరమైన మందులు కూడా స్టాక్ లేవు. ప్రస్తుతం ANM బి. పద్మ మాత్రమే సుగర్, BP పరీక్షలు చేసి సీజనల్ వ్యాధులకు మందులు ఇస్తున్నామని తెలిపారు.

నాయకుల డిమాండ్లు...

ఈ సందర్భంగా ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, వ్యకాస మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాసరావు, కార్యదర్శి తూము సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

వారు ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్లు:

1. పాలడుగులో వెంటనే నూతన దవాఖానా భవనం నిర్మించాలి

2. డాక్టర్లు, అవసరమైన సిబ్బందిని నియమించాలి

3. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి

4. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయలు కనీస వేతనం ప్రకటించాలి

ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా రూరల్ అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ, మాజి కార్యదర్శి షేక్ షేనాబి పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు ఇలా ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని నాయకులు ప్రశ్నించారు.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >