| Daily భారత్
Logo




రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

News

Posted on 2026-07-18 06:16:11

Share: Share


రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మొత్తం 06 పతకాలు సాధించిన పోలీసు సిబ్బంది

జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని విజేతలకు ఎస్పీ ఆకాంక్ష

పతక విజేతలను ఘనంగా సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుండి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలతో మొత్తం 06 పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.

ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, పోలీసు విధుల్లో సమర్థతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శప్రాయమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇవే లక్షణాలు విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

జిల్లా పోలీసు శాఖలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, సిబ్బంది తమ విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ పోలీసు శాఖకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఏఆర్ డిఎస్పి ఉదయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి వివిధ క్రీడల్లో పాల్గొనగా, అందులో ఐదుగురు పోలీసు సిబ్బంది మొత్తం 06 పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

పతక విజేతల వివరాలు:

1. ఎన్. ఉత్తేజ్ (పీసీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ - వుషూ (80 కేజీలు) – స్వర్ణ పతకం , బాక్సింగ్ (80 కేజీలు) – రజత పతకం 

2. పి. బాలరాజు (పీసీ), నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ - రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్ – 97 కేజీలు) – రజత పతకం 

3. జె. అంకోష్ (పీసీ), డీఏఆర్, కామారెడ్డి - రెజ్లింగ్ (గ్రెకో రోమన్ – 87 కేజీలు) – కాంస్య పతకం 

4. ఎన్. ప్రభు (పీసీ), డీఏఆర్, కామారెడ్డి- రెజ్లింగ్ (గ్రెకో రోమన్ – 97 కేజీలు) – కాంస్య పతకం 

5. చి. వినయ్ రెడ్డి (పీసీ), ఎస్‌ఎస్ నగర్ పోలీస్ స్టేషన్ - కరాటే (60 కేజీలు) – కాంస్య పతకం

భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి కామారెడ్డి జిల్లా, తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పతక విజేత పోలీసు క్రీడాకారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >