| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

డైలీ భారత్, జోధ్‌పూర్:రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు (మాండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపు) ఒక అరుదైన ప్రేమకథకు, అంతకంటే అరుదైన కోర్టు తీర్పునకు వేదికైంది. 

యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమించుకోగా, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు (ఆర్టికల్ 21) కింద వారి వివాహానికి రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది

కేసు వివరాల్లోకి వెళ్తే...

నాగౌర్ జిల్లాకు చెందిన మూలారామ్ 2017 నుంచి ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

అలాగే జోధ్‌పూర్‌కు చెందిన సీమా ఘడ్సే అనే మహిళ, ఇష్టం లేని పెళ్లి కారణంగా భర్తను హతమార్చిన కేసులో 2019లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తోంది. 

ఓపెన్ జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు కల్పించే ఉపాధి పనుల్లో భాగంగా, వీరిద్దరూ పొలాల్లో పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, జీవితాంతం కలిసి నడవాలని నిర్ణయించుకున్న ఈ జంట వివాహ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించింది.

ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ: హైకోర్టు

ఈ వినూత్న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ డా. పుష్పేంద్ర సింగ్ భాటి, జస్టిస్ ప్రవీర్ భట్నాగర్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఇద్దరు వ్యక్తులు తమ స్వేచ్ఛా సంకల్పంతో వివాహం చేసుకోవడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో భాగమే."

అని స్పష్టం చేస్తూ న్యాయస్థానం వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కఠిన నిబంధనల నడుమ వివాహం

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల జూలై 22న కఠినమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వీరి వివాహ వేడుక జరగనుంది. 

ఈ పెళ్లికి కోర్టు కొన్ని షరతులను విధించింది:

వివాహ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి గరిష్ఠంగా 21 మంది సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

 పెళ్లికి అయ్యే ఖర్చులన్నింటినీ ఖైదీల కుటుంబాలే భరించాల్సి ఉంటుంది.

శిక్ష అనుభవిస్తూనే, చట్టపరమైన అనుమతితో ఒకటవుతున్న ఈ జీవిత ఖైదీల ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Previous భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Next జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
ADVERTISEMENT