| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: మాధాపూర్‌లోని శ్రీ సినోమా హోటల్‌లో వర్కర్, కుక్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్. భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా వేధిస్తున్నట్లు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వరంగల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అలానే వేధిస్తున్నాడని యువతులు తమ తండ్రి రాజుకు తెలియజేయగా.. ఆయన ఫోన్ చేస్తే దమ్ముంటే హైదరాబాద్‌కు రండి.. చూసుకుందాం” అంటూ సవాల్ విసిరిన భాస్కర్.దీంతో రాజు తన బావమరిది కుమారస్వామితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి, రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్‌పై కర్రలు, కత్తులతో దాడి.తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందగా మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాధాపూర్ పోలీసులు.

Previous ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్
Next తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు
ADVERTISEMENT