| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

డైలీ భారత్ డెస్క్: తెలంగాణలో సర్‌( SIR ) నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) ఆగస్టు 3 వరకు పొడిగించింది. సెప్టెంబర్‌ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈనెల 24 వరకు ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3వ తేదీవరకు పొడిగించింది.అనేక జిల్లాలో సర్‌పై అవగాహన లేక మందకోడిగా కొనసాగుతుండగా గడువు సమీపిస్తుండడంతో అనేక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణను పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు అందించాయి . దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ గడువు పొడిగింపును ప్రకటించింది.

Previous హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య
Next సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
ADVERTISEMENT