| Daily భారత్
Logo




కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

News

Posted on 2026-07-13 18:16:26

Share: Share


కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

మత్తులోకి నెట్టి బంగారం, వెండి ఆభరణాలు అపహరించిన నిందితుడు అరెస్ట్ – 48 గంటల్లో కేసు ఛేదించిన ఎల్లారెడ్డి పోలీసులు.

48 గంటల్లో కేసు ఛేదన – చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా స్వాధీనం.

 కేసు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: తేది 11-07-2026న ఫిర్యాదుదారుడు తలారి సంగయ్య తన తల్లి తలారి దుర్గవ్వ మరియు పక్కింటి మహిళ కుక్కల పోశవ్వతో కలిసి ఇంటి వద్ద ఉండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి బెయిల్ పనిమీద వచ్చానని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వారికి కల్లు తాగించి, వారు అప్రమత్తంగా లేని సమయంలో తలారి దుర్గవ్వను బలవంతంగా కిందకు వంచి ఆమె మెడలో ఉన్న సుమారు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడును తెంచుకొని, కుక్కల పోశవ్వ చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల వెండి పట్టే కడెంను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

కేసు వివరాల్లోకి వెళ్తే...

గతంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, లింగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దొంగతనం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లిన ఇద్దరు నిందితులకు అక్కడ పరిచయం ఏర్పడింది. వారిలో ఒకరు తన ఇంట్లోని బీరువాలో నగదు, బంగారం ఉన్నాయని చెప్పడంతో, మరో నిందితుడు వాటిని ఎలాగైనా దొంగిలించాలని ముందుగానే పథకం రచించాడు.

బెయిల్‌పై విడుదలైన అనంతరం నిందితుడు లింగారెడ్డిపేటలోని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అయితే బీరువాలో ఎలాంటి విలువైన వస్తువులు దొరకకపోవడంతో అక్కడ ఉన్న వృద్ధ మహిళలకు కల్లు తాగించి మత్తులోకి నెట్టాడు. అనంతరం ఒక మహిళ మెడలోని బంగారు గుండ్ల తాడును, మరో మహిళ చేతికి ఉన్న వెండి పట్టే కడెంను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు.

దర్యాప్తులో భాగంగా బాధితులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించి, సీసీ కెమెరా దృశ్యాలు, పాత నేరస్తుల రికార్డులను విశ్లేషించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు ఎల్లారెడ్డిలోని బంగారు దుకాణాల వైపు వెళ్తుండగా, బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించడంతో కేసును ఛేదించారు.

నిందితుడి వివరాలు:

నీరుడి సాయిలు, తండ్రి: బాలయ్య, వయస్సు: 49 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: కొండాపూర్ గ్రామం, లింగంపేట మండలం.

నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తి:

1. 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు.

2. 40 గ్రాముల వెండి పట్టే కడెం.

నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఎల్లారెడ్డి సీఐ తెలిపారు.

నిందితుడి నేర చరిత్ర:

నిందితుడిపై ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేట, నిజాంసాగర్, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 8 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ఇతనిపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో సుమారు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

ఈ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసి, దొంగిలించిన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారి ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి, ఎస్‌ఐ ఎన్. రాజు, కానిస్టేబుళ్లు శ్యామ్, ఇద్రీస్, సంజీవ్, వసుందర్, విజయ్లు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా దృశ్యాలు మరియు విశ్వసనీయ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసును విజయవంతంగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >