| Daily భారత్
Logo




షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

News

Posted on 2026-07-13 18:11:11

Share: Share


షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌కుమార్, సరిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. రాజ్‌కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సరిత దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. సరితను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజ్‌కుమార్ వచ్చిన సంబంధాలను చెడగొట్టాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్‌కుమార్.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చనిపోతానని బెదిరించటంతో అతడి తల్లిదండ్రులు కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేశాడు. జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్.. తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడు. రాజ్‌కుమార్ వేధింపులు తాళలేకపోయిన సరిత విడాకులు అడిగింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు..

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >