| Daily భారత్
Logo




"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

News

Posted on 2026-07-11 13:59:01

Share: Share


"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడం మరియు ప్రాథమిక ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల , సిరిసిల్ల విద్యార్థులు ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ లో ఫీల్డ్ క్యాంప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని కుటుంబాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, పోషకాహార లోపం, వ్యక్తిగత పరిశుభ్రత, తల్లి-శిశు ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు మరియు జీవనశైలి సంబంధిత వ్యాధులపై సమాచారం సేకరించారు.

 అలాగే ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

నర్సింగ్ విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించడం, అవసరమైన వారికి సమీప ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించడం జరిగింది. 

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్తులో అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించారు.

ఈ ఫీల్డ్ క్యాంప్‌లో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల, అడ్వకేట్ దాసరి తిరుమల, డాక్టర్ అలువాల సుమంత్, వార్డు కౌన్సిలర్ మామిడాల మహేష్, కొండ ప్రకాశ్, వంతడుపుల రాము, గొల్లపల్లి బాలయ్య, వంగరీ అనిల్,కళాశాల అధ్యాపకులు సుశీల, గ్లోరి , సంధ్యారాణి, స్వరూప స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు గ్రామస్థులు పాల్గొని విద్యార్థుల సేవలను అభినందించారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >