Posted on 2026-06-15 17:36:41
డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు విద్యార్థి విద్యార్థులకు వందమందికి అట్ట పుట్టల వితరణ చేయించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు హమీద్ ఉపసర్పంచ్ గారి సహకారంతో ఈ అట్టపుట్టల ను విద్యార్థులకు అందించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చే పిల్లలే ఉంటారని వారికి తప్పకుండా మేము అండగా ఉంటామని తెలియజేశారు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు పాఠశాల పక్షాన ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >