కామేపల్లి లో జిల్లా రైతు శిక్షణా తరగతులు
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ
డైలీ భారత్, కామేపల్లి: కేంద్ర ప్రభుత్వం ఎరువులు కంపెనీలు పెంచుతున్న ధరలను నియంత్రణ చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం కామేపల్లి మండల కేంద్రంలో లావుడ్యా రామా అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో రాంబాబు, కృష్ణ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కు ముందే కంపెనీలు రెండు దఫాలుగా ఎరువులు ధరలు పెంచాయి అని అన్నారు, యూరియా,డిఎపి మినహా మిగతా ఎరువులు రెండు వేల రూపాయలు దగ్గర కి చేరాయి అని అన్నారు.పెరిగిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు రైతులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఇప్పటికే సంక్షోభం లో ఉన్న రైతులపై అదనపు భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఎరువులు భారం రైతు పైన పడకుండా ధరలు నియంత్రణ చేయాలి అని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రైతు శిక్షణా తరగతులు జూన్ మొదటి వారంలో రెండు రోజులు కామేపల్లి మండలం లింగాల కాస్ర్ రోడ్డు మేకల ధనమ్మ పంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నాం అని రైతులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు సిఐటియు మండల కన్వీనర్ బాదావత్ శ్రీనివాసరావు, వీరాస్వామి, అంజయ్య, శాంతయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు