| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు

మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు

డైలీ భారత్, బిహార్: మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

తాజాగా ధన్బాద్ నుంచి పాట్నా వెళ్తున్న గంగా దామోదర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏకంగా కంపార్ట్‌మెంట్ పైకప్పులోనే సుమారు 5 వేల బీర్ టిన్స్ దాచిపెట్టి తరలిస్తుండగా బయటపడింది.

అయితే బోగీ పైకప్పులో దాచిన టిన్స్ ప్రయాణ సమయంలో ఒకదానికొకటి ఢీకొనడంతో కొన్ని లీక్ అయ్యాయి. దీంతో బోగీలో వర్షపు చినుకుల్లా బీర్ కారడం మొదలైంది. అనుమానం వచ్చిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇదే రైలులో నెల రోజుల క్రితం కూడా సుమారు 1500 మద్యం క్వార్టర్ బాటిల్స్ పట్టుబడటం గమనార్హం. వరుస ఘటనలతో బీహార్‌లో రైళ్ల ద్వారా జరుగుతున్న అక్రమ మద్యం రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

Previous నీట్ పేపర్ లీకేజీ కేసులో సూత్రధారి అరెస్ట్..
Next సైబర్ నేరస్టూడిని అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
ADVERTISEMENT