| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సైబర్ నేరస్టూడిని అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు

సైబర్ నేరస్టూడిని  అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు

డైలీ భారత్ ఖమ్మం: ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 18 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులలో ఇద్దరిని  ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్  రాష్టo  లోని  వెస్ట్ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం  లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి Whatsapp లో పరిచయం అయి ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ మరియు ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 18  లక్షలు రూపాయలు  ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను మరియు వివిధ  కేసులలో నిందితుడు గా  ఉన్న అక్కౌంట్  హోల్డర్ అయిన సింగంశెట్టి  సురేష్ , వయస్సు 32 సం: లు  ను వెస్ట్ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం లో  అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి. ఎస్పీ, CH.R.V. ఫణిందర్ ని మరియు అట్టి టాస్క్ లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూక్యా రవి కుమార్  , ఎస్సై లు  రoజిత్  కుమార్ , విజయకుమార్ లను,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు ,కానిస్టేబుల్స్ భాను మూర్తి  , కృష్ణ ప్రసాద్  ,నాగేశ్వరావ్   మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం C.P. సునీల్ దత్, IPS అభినందించారు.

Previous మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు
Next మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు రివార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ADVERTISEMENT