డైలీ భారత్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్‌లోని పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సంచలనం నమోదైంది.
కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్నా దేబ్నాథ్ తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న పానిహాటిలో రత్నా దేబ్నాథ్ ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పరోక్షంగా ప్రజల మద్దతు కోరిన ఆమెకు, ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది