| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జన్మదిన వేడుకలను కొత్తగూడెం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో గల బిజెపి జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా జన్మదినం సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర బిజెపి రథసారథి, కాషాయ యోధుడు,  నిత్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్న తపస్వి నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ, పార్టీ పటిష్టతకై అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరిగిందని, స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిజెపి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందన్నారు. బిజెపి పార్టీ అధ్యక్షులుగా రామచంద్రరావు పార్టీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన ఎన్నికల సందర్భంలో పార్టీకి ఓటింగ్ శుభ పరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  రానున్న కాలంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా ఇంకా పట్టు విడవని విక్రమార్కుడిలా కృషి చేయాలనికోరారు.ఈ కార్యక్రమంలో జాటోత్ వెంకన్న, బలగం శ్రీధర్, నరేంద్రబాబు, భూక్య రవినాయక్, సలీం, రాకేష్, మురళి, ఎల్.రమేష్, బాలరాజు, రవీందర్, సుధాకర్, హైట్ శ్రీనివాస్, నవీన్, మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, కవిత, కళావతి బిజెపి పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Next తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
ADVERTISEMENT