| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్‌, భద్రాద్రి, కొమురంభీంలలో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్‌, నారాయణపేట, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీలు, ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌లో 43 డిగ్రీలు, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏపీలోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్కాపురం, నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీలు, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు

Previous ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Next డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
ADVERTISEMENT