| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి

ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి

డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో  నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో  రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , ,

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, 2BHK హౌసింగ్ పథకాల పురోగతిపై సమగ్ర చర్చ జరిగింది.

సమావేశంలో షబ్బీర్ అలీ  పథకాల అమలు వేగవంతం చేయడం, అర్హులైన పేదలకు గృహాలు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. 

ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ఆయన దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ స్వప్నాన్ని సాకారం చేయడంలో కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇండ్లు మరియు 2BHK పథకాలు సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , సుదర్శన్ రెడ్డి , సంబంధిత ఎమ్మెల్యేలు, హౌసింగ్ ఎండీ గౌతమ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Previous లేమామిడిలో అంబరాన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
Next పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
ADVERTISEMENT