| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ నేతగా, తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు పదేళ్లు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తల్లాడ లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి వి ఆర్) అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులకు వరి, మొక్కజొన్న కొనుగోలు లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు చిన్నబ్బాయి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, షేక్ కమల్, ఏలూరు రఘు, సంఘసాని శ్రీనివాసరావు, డేగల సురేష్, పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.


Previous ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి
Next ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ADVERTISEMENT