| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

విశాఖపట్నంలో విషాద ఘటన

డైలీ భారత్, విశాఖపట్నం: నగరంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఎండాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో మోసపోయి తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం… ఎండాడ రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్న భాస్కర్‌రావు కుమార్తె సంధ్య కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇటీవల అతడు మోసం చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Previous శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Next మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
ADVERTISEMENT