డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో తెలంగాణ రైతు సంఘం (ఏ ఐ కే ఎస్ ) రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతంగా ముగించుకుని మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బోడంకి చందు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపతి మధుసూదన్ చర్ల మండలం మొగలపల్లి గ్రామానికి చేరుకుని, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు చింతూరి వెంకటరావు తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.
చింతూరు వెంకట్రావు 94 ఏళ్ల జీవిత ప్రయాణంలో సమాజహితం కోసం నిరంతరం పోరాడుతూ, పీడిత ప్రజల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచినారు, వెంకటరావు గ్రామీణ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని నాయకులు కొనియాడారు. ఆయన సేవలు కార్మిక, కర్షక లోకానికి మార్గదర్శకంగా నిలిచాయని, మార్క్సిస్టు సిద్ధాంతాలను ఆచరణలో చూపిన మహనీయుడని ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండంకి చందు, నాయకుడు రఘుపతి మధుసూదన్ తదితరులు శాలువాలతో సన్మానం చేసి, గురువర్యులకు అక్షర కుసుమాలు అర్పించారు. వారి సందేశంలో “చింతూరి వెంకటరావు జీవితం ఒక పోరాట గాథ, ఒక చైతన్య జ్యోతి అని ప్రశంసించారు,
ఈ కార్యక్రమంలో ఆయన ఏకైక కుమారులు చింతూరి రజనీకాంత్, కూతుర్లు హేమలత,నాగమణి, మనుమరాలు అరుణకుమారి , జరీనా, మనుమండ్లు మిధున్ చక్రవర్తి, మల్లికార్జున రావు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.