| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై శ్రీ వాసవి మాత చిత్ర పటానికి పుష్పమాల వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Previous పంజాబ్‌లో ప్రభుత్వమూ బీజేపీదేనా.?
Next ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య
ADVERTISEMENT