డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలకు వరిగడ్డి వితరణ కార్యక్రమం నిర్వహించబడింది.
గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గూడ దేవేందర్ రెడ్డి శనివారం మూగజీవాలపై తన మమకారాన్ని చాటుతూ మొత్తం 342 వరిగడ్డి కట్టలను గోశాలకు అందజేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ,
“మూగజీవాల సంరక్షణ మన అందరి బాధ్యత. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో గోశాలల్లో ఉన్న పశువులకు తగిన ఆహారం అందించడం చాలా అవసరం. చిన్న సహాయం చేసినా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహాయం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
అలాగే, గతంలో కూడా తాను పలుమార్లు గోశాలకు వరిగడ్డి వితరణ చేసినట్లు తెలిపారు.
#Vemulawada #Goshala #AnimalCare #TempleUpdate #asi devendhar reddy