| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

డైలీ భారత్, పల్నాడు జిల్లా:  అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై ప్రజలు ఆందోళన చెందవద్దని పల్నాడు జిల్లా కలెక్టర్ కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ నిర్వహించిన సమీక్షా సమావేశం ప్రకారం, జిల్లాలో ఎక్కడైనా ఇంధన నిల్వలు తక్కువగా ఉంటే వెంటనే గుర్తించి, ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా సరఫరా పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఏడాది అమ్మకాల గణాంకాల ఆధారంగా నిల్వలు పంపిణీ చేస్తున్నామని, ముఖ్యంగా రైతులకు ఇబ్బంది కలగకుండా 10% అదనంగా డీజిల్ లోడ్లు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడటమే కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

Previous కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Next రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ
ADVERTISEMENT