Posted on 2026-04-19 22:22:58
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేవలం 5000 అటెండెన్స్ ఫీజు కట్టకపోవడంతో విద్యార్థికి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఇవ్వని శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం . శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో బీటేక్ మూడోవ సంవత్సరం చదివే ప్రణీత్ (22)అనే విద్యార్థి
ఎప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణతతో ప్రధమ శ్రేణిలో ముందేడే విద్యార్థి...హాల్ టికెట్ ఇవ్వకపోవటంతో ఇక ఎగ్జామ్స్ రాయలేనని తీవ్ర మాస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ ఇందు కళాశాల ముందు పలు విద్యార్థి సంఘాల ఆందోళన.....విద్యార్థిని కాలేజీ యజమాన్యం అటెండెన్స్ ఫీజు వేధింపుతోనే ఆత్మీహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మీడియా ముందు బోరున విలపించిన తల్లిదండ్రులు.అటెండన్స్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వకపోవడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుని తల్లిదండ్రులు .పోస్టుమార్టం చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పమని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపి కేపీవీ.రాజు, సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >