| Daily భారత్
Logo




సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం

News

Posted on 2026-04-14 18:02:15

Share: Share


సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల :  జిల్లాలోనే ప్రథమ స్థానం

సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల ఘన విజయం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల విద్యార్థినులు మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాలల్లోనే కాకుండా ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఉత్తీర్ణత శాతంలో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జిల్లా లోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం

కళాశాల మొత్తం ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 65 శాతం, మొదటి సంవత్సరంలో 55 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది

ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని పెండోటి స్నేహిక 990/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది.

ఇతర ప్రతిభావంతులైన విద్యార్థినులు:

ద్వితీయ సంవత్సరం టాపర్లు:

కె. అఖిల (MPC) – 985/1000

జి. రాజశ్వని (BiPC) – 971/1000

ఎల్. సుష్మిత (BiPC) – 969/1000

జి. శివాని (CEC) – 943/1000

ఖాతిజ ఫలక్ (HEC) – 672/1000

మొదటి సంవత్సరం టాపర్లు:

జె. కృష్ణవేణి (BiPC) – 435/440 (జిల్లా ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయి ర్యాంక్)

కె. వైష్ణవి (MPC) – 455/470

సూఫియా తరన్నుమ్ (MPC) – 453/470

ఎం. దీక్షిత (BiPC) – 429/440

ఏ. సంధ్య (CEC) – 467/500

ఎం. ఆశ్విత (HEC) – 337/500

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి మాట్లాడుతూ, అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థినులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే ఈ విజయాల వెనుక నిరంతరం శ్రమించిన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యార్థినుల పట్టుదల వల్లే సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సిరిసిల్ల జిల్లాలో ర్యాంకులు సాధించే ప్రముఖ బాలికల కళాశాలగా నిలిచిందని పేర్కొన్నారు.

సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల

ప్రిన్సిపాల్ & అధ్యాపక బృందం

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >