| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్  అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగాన్నపాలెం అంబేద్కర్ యూత్  ఆధ్వర్యంలో  అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసేయ్ రోడ్డు ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలను దేశానికి అందించారు. ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ ప్రపంచంలోనే అతి ప్రగతిశీలమైనదిగా ప్రశంసలు అందుకుంటోంది. అస్పృశ్యత, కుల వ్యవస్థపై ఆయన తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు.

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ అని వారు కొనియాడారు

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి వెంగాన్నపాలెం అంబేద్కర్ యూత్, నాగరాజు, పవన్, నరేందర్, ఇ.నాగరాజు, ఎమ్మార్పీఎస్ సాయికుమార్, దళిత నాయకులు కిరణ్, బీసీ సంఘం నాయకులు బాపట్ల మురళి, వేపూరు  నరసింహారావు, పుల్లారావు, బిఆర్ఎస్ రామ్మూర్తి,  కాకటి కృష్ణ, గార్లపాటి వెంకటి, చంగల నరసింహారావు, మాల మహానాడు నాయకులు  తదితరులు పాల్గొన్నారు

Previous జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Next సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
ADVERTISEMENT