| Daily భారత్
Logo




సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల నిరసన దీక్షలు తాత్కాలిక విరమణ

News

Posted on 2023-09-21 15:35:30

Share: Share


సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల నిరసన దీక్షలు  తాత్కాలిక విరమణ

డైలీ భారత్, సిరిసిల్ల: సమగ్ర శిక్ష ఉద్యోగు లను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరణ చేపట్టాలని గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చేపట్టిన  నిరసన దీక్షలను గురువారం విరమించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో, గౌరవ MLC కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో జరిగిన చర్చల అనంతరం ఈ క్రింది డిమాండ్స్ నెరవేర్చుతామని చెప్పడం జరిగింది.

1. క్రమబద్ధీకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని కనీస వేతన స్కేల్ను వెంటనే అమలు చేయడం.

2. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించడం.

3. PTI (part Time instructure)కు 12 నెలల వేతనం ఇవ్వడం.

4. జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా కల్పించడం.

5. గత 20 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలకు సైతం వేతనం ఇవ్వడం.

కనీస వేతన స్కేల్ గురించి గౌరవ విద్యాశాఖ మంత్రి  విద్య శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన తో ఫోన్లో సంప్రదించి MTS  సంబంధించిన నోట్ ఫైల్ తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు. కావున ప్రభుత్వం నుండి ఖచ్చితమైన హామీలు వచ్చినందున, ఇచ్చిన హామీని నెరవేరుస్తారని నమ్మకంతో ఈ నిరసన దీక్షలను  తాత్కాలికంగా విరమింప చేస్తున్నాము.

నిరసన దీక్షలకు సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు వివిధ రాజకీయ పార్టీలకు సామాజిక సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా తమ కలంతో మా గలాన్ని వినిపించేందుకు వారదులుగా నిలిచిన ప్రింట్ మీడియా పాత్రికేయులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


ఇట్లు ..

సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >