| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొక్కల వెంకటయ్య కు 50వేల నజరానా

మొక్కల వెంకటయ్య కు 50వేల నజరానా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం కు చెందిన రాయి వెంకటయ్య అలియాస్ మొక్కల వెంకటయ్య కు 40 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై చేస్తున్న విశేష కృషికి గాను నిర్వి ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సమాజ సేవలు చేస్తున్న వారికీ అందించే టాప్ 100 సోషల్ హీరోస్ అవార్డ్స్ లో భాగంగా అవార్డును అందించడంతో పాటు రివార్డుగా 50 వేల రూపాయలను నిర్వాహకులు హేట్రో అధినేత MP పార్థసారథి  MP లక్ష్మణ్ DIG మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది 

 ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ సేవ చేసే వాళ్ళే నిజమైన హీరోలని వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

 ప్రకృతికి నిజాయితీగా చేసిన నిస్వార్ధమైన సేవలకు దక్కిన గౌరవం


Previous బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
Next తెలంగాణలో గడ్డి, కలుపు మందులు నిషేదించండి..: రైతు కమిషన్
ADVERTISEMENT