డైలీ భారత్, కటక్: ఒడిశాలోని కటక్‌లో ఉన్న ఎస్సీబి మెడికల్ కాలేజ్–హాస్పిటల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత చిన్నగా ప్రారంభమైన మంటలు క్రమంగా విస్తరించి ఐసీయూ మొత్తం వ్యాపించాయి.
ఈ విషాద ఘటనలో కనీసం 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఐసీయూలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులు ఉండటం వల్ల మంటల నుంచి బయటపడలేకపోయారు.
అలాగే 11 మంది ఆసుపత్రి సిబ్బందికి కాలిన గాయాలు అయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంటలు గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక దళాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆసుపత్రులలో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
#HospitalFire #OdishaNews #Cuttack
#ICUFire #BreakingNews #HospitalSafety
#FireAccident #IndiaNews #PrayForVictims
#NewsUpdate