డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో పంట ధ్వంసం అయిన పొలాన్ని పరిశీలించిన బీజేపీ పార్టీ నియోజకవర్గం నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ మందారం గ్రామ పంచాయతీ పరిధిలో గల గిరిజన రైతు కురం రాజబాబు(నాయకపోడు) యొక్క తల్లిగారి పేరు మీద ఉన్న 3-00 ఎకరాల భూమిలో ఉన్న జామాయిల్ తోటలో 1.20 కుంటలలో ఉన్న జామయిల్ ను ద్వంసం చేసి రైతుకు సుమారు మూడు లక్షల రూపాయలు ఆర్థిక నష్టాన్ని కలిగించి,కౌలు దక్కించుకునేందుకు బెదిరింపులకు పాల్పడిన అదే మధారం గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనేతర వ్యక్తులపై కటిన చర్యలు తీసుకోవాలని,వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,బాధితులకు అండగా బీజేపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
News
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి