| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా సంఘం ఆధ్వర్యంలో మున్నూరుకాపు కౌన్సిలర్లకు సన్మానం

జిల్లా సంఘం ఆధ్వర్యంలో మున్నూరుకాపు కౌన్సిలర్లకు సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి:  కామారెడ్డి పట్టణం వివిధ వార్డుల్లో ఆయా పార్టీల నుంచి గెలుపొందిన మున్నూరుకాపు సామాజిక వర్గం కౌన్సిలర్లు కాసర్ల మాధవి, ఆకుల సుజిత, లోలం శ్రీనివాస్, రాంశెట్టి హర్షిత, కాసర్ల గోదావరి, గోపు బాలమణి, మామిండ్ల లక్ష్మణ్, కాసర్ల రాణిలు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వరంలో సోమవారం ఘనంగా సన్మానించారు. 49 వార్డుల్లో 9 మంది కౌన్సిలర్లు గెలుపొందడం హర్షనీయమని, ప్రజల్లో సేవభావం కల్గినవారితో పాటు బీసీలను గెలుపించడం మార్పుకు కారణమని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, పెట్టుగాడి అంజయ్యలు అన్నారు.

కార్యక్రమంలో నాయకులు గాండ్ల వెంకటరాజు, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల స్వామి, రవీందర్, ఆకుల భరత్ కుమార్, గోపు నర్సింలు, రాంశెట్టి భూపతి తదితరులు పాల్గొన్నారు.

Previous హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ వద్ద మెట్రోతో అనుసంధానం
Next ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
ADVERTISEMENT