| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెన్నెడీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు కలిసి ఆనందంగా పాల్గొన్నారు. పాటలు, డాన్సులతో విద్యార్థులు కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటాలని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ డేనియల్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతూ, పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించేలా కట్టుదిట్టంగా సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు విశాలమైన వాతావరణంలో ఇలాంటి అంగుహార్ బాటలు లేకుండా ప్రకృతి లో నిర్వహించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Previous 38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Next మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
ADVERTISEMENT