| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రెండు స్పా సెంటర్లపై దాడులు... 20 మంది అరెస్ట్

రెండు స్పా సెంటర్లపై దాడులు... 20 మంది అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించామని ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినందుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడి సందర్భంగా మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Previous ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Next సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు
ADVERTISEMENT