| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కి పదవి గండం ?

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కి పదవి గండం ?

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్  ఎన్నిక చెల్లదంటూ  వారి రాజకీయ ప్రత్యర్థి  రంగ మాధవి ఈరోజు కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు.

కామారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులోంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి రాష్ట్ర ఎన్నికల నియమాల కి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో  ఎన్నికయ్యారని వారి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ద్వారా దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ ఈరోజు కోర్టులో అడ్మిట్ అయింది.

 ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా ప్రధాన  న్యాయమూర్తి  CHVRR Prasad గారు విచారణకు స్వీకరించారు. 

దీంతో ఉమారాణి  కౌన్సిలర్ ఎన్నిక విషయంలో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మున్సిపల్ చైర్మన్ గా  ఎన్నికైన ఉమారాణి  శ్రీనివాస్ కి పదవి గండం ఏర్పడుతుంది.

మున్సిపల్ చైర్ పర్సన్ కోర్టు కేసు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది

Previous జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
Next ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
ADVERTISEMENT