Posted on 2026-02-20 08:57:22
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పిల్లలను కొడితేనే చదువు వస్తుందనేది పాత కాలం నాటి మాట. నేటి చట్టం ప్రకారం విద్యార్థిని తాకడం లేదా తిట్టడం కూడా శిక్షార్హమైన నేరమే. ఆర్టిఐ యాక్ట్, 2009 (సెక్షన్ 17): విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్లో పిల్లలను శారీరకంగా శిక్షించడం లేదా మానసికంగా వేధించడం పూర్తిగా నిషిద్ధం.
• సుప్రీంకోర్టు తీర్పు: పిల్లల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం రాజ్యాంగంలోని "ఆర్టికల్ 21" (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు వస్తుంది.
• జూవైనల్ జస్టిస్ యాక్ట్: పిల్లలపై క్రూరంగా ప్రవర్తించే టీచర్లు లేదా యజమాన్యాలకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
పరిష్కారం:
1. స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు: ముందుగా సదరు టీచర్‌పై ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేయండి. ఒకవేళ యాజమాన్యం ఆ టీచర్‌ని సమర్థిస్తే, ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవచ్చు.
2. SCPCR కి ఫిర్యాదు: ప్రతి రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (State Commission for Protection of Child Rights) ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌లో లేదా నేరుగా ఫిర్యాదు చేస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు వెళ్తారు.
3. పోలీస్ ఎఫ్‌ఐఆర్ (FIR): బిడ్డకు గాయాలైనా లేదా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనా BNS (భారతీయ న్యాయ సంహిత) కింద పోలీసులకు ఫిర్యాదు చేయండి.
4. చైల్డ్ లైన్ 1098: అత్యవసర సమయంలో ఎవరికి చెప్పాలో తెలియకపోతే 1098 కి ఫోన్ చేయండి. వారు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >