| Daily భారత్
Logo




మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

News

Posted on 2026-02-15 15:45:50

Share: Share


మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో  కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

మద్దికుంట బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

భక్తుల సౌకర్యం, భద్రతే మా ప్రధాన లక్ష్యం – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS

డైలీ భారత్, కామారెడ్డి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామంలోని బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా బుగ్గ రామేశ్వర లింగ ఆలయంలో నిర్వహిస్తున్న రథోత్సవాన్ని జిల్లా ఎస్పీ సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.

భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి భక్తుడు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే, తాడువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును కూడా జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి, పరస్పర సామరస్యంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >